![]() |
![]() |
.webp)
అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా దేశంలో జారుకుంటున్న పరిస్థితుల మీద ఒక పోస్ట్ పెట్టింది. "భారత్ దేశం స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు అంటారంటే ఇందుకే..ఇక్కడ ఉండేవాళ్ళకు జీరో సివిక్ సెన్స్ కాబట్టి" అంటూ ఆ కిందనే ఇంకా ఇలా కూడా పోస్ట్ చేసింది. " నేనెప్పుడూ ఇలానే వివరించడానికి ప్రయత్నిస్తాను.. మనం నాగరికంగా ప్రవర్తించాలనే ఉద్దేశ్యంతో చెప్తూ ఉంటాను... ఈ మనుషులు ఎలాంటి వాతావరణంలో పెరిగారో అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఐనా సమయం ఏమీ మించిపోయింది లేదు. ఏ పరిస్థితిలో ఐనా ఇతరులను బాధించడం అనేది మీ హక్కు కాదు అనే విషయాన్నీ ముందుగా తెలుసుకోవాలి.
.webp)
ఏ పరిస్థితిలోనా ఐనా కానీ ప్రశాంతంగా, మంచిగా ఉండడం నేర్చుకోవాలి. ఇప్పటికైనా నేర్చుకోండి...మీ పిల్లల్ని చూస్తున్నారు." అంటూ అనసూయ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఈ కామెడీ షోలో తన యాంకరింగ్ తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది ఈ బ్యూటీ. మోడ్రన్ డ్రెసెస్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలనీ చూస్తో ఉంటుంది అనసూయ.. అందమైన తినేసేలా ఉండే చూపులతో కటింగులు ఇచ్చే ఆటిట్యూడ్ తో ఎప్పుడూ రకరకాల ఫోటో షూట్స్ తో సందడి చేస్తూనే ఉంటుంది.
![]() |
![]() |